![]() |
![]() |
.webp)
కుక్ విత్ జాతిరత్నాలు షోలో కొత్త కుక్స్ రాకతో పోటీ ఆసక్తికరంగా మారింది. శనివారం ఎపిసోడ్‌లో శ్రవణ్, పునర్నవి తమ వంటకాలతో ఆకట్టుకున్నారు. ఆదివారం వచ్చిన కృతిక, సుమిత్ మాత్రం వంటలతో మెప్పించలేకపోయారు.ఆదివారం ఎపిసోడ్‌లో జాతిరత్నాలు లెజెండరీ కమెడియన్లు ఐన పావలా శ్యామల, కల్పనా రాయ్, బ్రహ్మానందం, బాబు మోహన్, ఎంఎస్ నారాయణ గెటప్పుల్లో వచ్చి సందడి చేశారు. ముఖ్యంగా ఇమ్ము బాబు మోహన్ ఎక్స్ప్రెషన్స్ తో ఆయనలానే కామెడీ చేయడంతో అందరూ ఫిదా ఇపోయారు. బాబు మోహన్ ని అచ్చం అలానే దించేసి నవ్వులు పూయించాడు.
పెయిరింగ్ టాస్క్‌లో కృతికకు ఇమ్ము, పవన్‌కు హరి, రాకేష్‌కు రీతూ, సుమిత్‌కు దీపిక, పల్లవికి దీక్ష జోడీగా నిలిచారు. అడ్వాంటేజ్ టాస్క్‌లో ఇమ్ము-కృతిక సక్సెస్ అయ్యారు . దాని ద్వారా కృతిక పవన్ వంటలోని ఒక ముఖ్యమైన ఇంగ్రిడియెంట్‌ను తీసేసింది. మరోవైపు బెలూన్‌పై కూర్చుని వంటకు అవసరమైన వస్తువులు తీసుకొచ్చే టాస్క్‌లో ఇమ్ము, దీపిక లేస్తూ కిందపడుతూ ఆడియన్స్ కి బాగా నవ్వుతెప్పించారు.
వంటల విషయానికి వస్తే.. కృతిక తయారుచేసిన గోల్డెన్ బ్లూమ్ టార్ట్ అనే ఫాన్సీ పేస్ట్రీ జడ్జ్‌లను పెద్దగా ఆకట్టుకోలేదు. "అందరూ కొత్త ప్రయోగాలు చేస్తుంటే నువ్వు మాత్రం చాలా సింపుల్ డిష్ చేశావు. ఇందులో 'వావ్' ఫ్యాక్టర్ లేదు" అంటూ కామెంట్స్ చేశారు. రాకేష్ చేసిన మక్నీ పనీర్ పార్సిల్ మాత్రం ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా టమాటాతో చేసిన క్రియేటివ్ ప్రజెంటేషన్‌ను జడ్జ్‌లు ఎంతో నచ్చేసింది. సుమిత్ చేసిన రెయిన్‌బో సాండ్ విచ్ మీద అలీ కామెంట్స్ చేశారు. "ఏడు రుచులు ఉంటాయని చెప్పావు కానీ ఒక్క రుచి మాత్రమే వస్తోంది" అంటూ అలీ కౌంటర్ వేశారు. జడ్జ్‌లు కూడా రెసిపీ తేడా కొట్టిందన్నారు .
పవన్ తయారుచేసిన గలంగళ్ రైస్, టెంపురా చికెన్ లాలిపాప్స్ మాత్రం అందరి మనసును దోచుకున్నాయి. "థాయ్‌లాండ్‌లో తిన్న ఫుడ్ గుర్తొచ్చింది" అంటూ అలీ ప్రశంసించగా.. సంజయ్, శ్రీదేవి, అరుణ కూడా "సూపర్.. యమ్మీ" అంటూ మెచ్చుకున్నారు. పల్లవి చేసిన చురోస్ తిరమిసు, పిస్తాచినోలో తీపి లేకపోవడంతో జడ్జ్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పల్లవి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటూ.. "నెక్ట్స్ టైమ్ ఇంకా బాగా ట్రై చేస్తాను" అని చెప్పింది. ఆదివారం ఎపిసోడ్ స్కోర్లు పవన్ – 93 మార్కులు, రాకేష్ – 91 మార్కులు, పల్లవి – 87 మార్కులు, కృతిక – 76 మార్కులు, సుమిత్ – 71 మార్కులు సంపాదించుకున్నారు. ఈ స్కోర్లతో కృతిక, సుమిత్ బాటమ్ లో నిలబడ్డారు.
![]() |
![]() |